పాక్ కు షాకిచ్చిన అంతర్జాతీయ కోర్టు.. కుల్ భూషణ్ జాదవ్ మరణ శిక్ష నిలిపివేత

-

భారత్, పాక్ జడ్జిలతో సహా.. 16 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. దీంతో అంతర్జాతీయ వేదిక వద్ద భారత్ కు అనుకూలమైన తీర్పు వచ్చింది.

కోట్లాది మంది భారతీయుల ప్రార్థనలు ఫలించాయి. అంతర్జాతీయ కోర్టు కుల్ భూషణ్ జాదవ్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. పాకిస్థాన్ కుల్ భూషణ్ జాదవ్ కు వేసిన మరణ శిక్షను అంతర్జాతీయ కోర్టు నిలిపి వేసింది.

భారత్, పాక్ జడ్జిలతో సహా.. 16 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. దీంతో అంతర్జాతీయ వేదిక వద్ద భారత్ కు అనుకూలమైన తీర్పు వచ్చింది.

కుల్ భూషన్ జాదవ్ కు పాక్ కోర్టు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆ శిక్షను పున:సమీక్షించాలని న్యాయమూర్తులు పాక్ కు సూచించారు.

అంతే కాదు.. వియాన్నా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందన్న భారత్ వాదనను కూడా 15 మంది జడ్జిలు సమర్థించారు. అంతే కాదు.. ఈ కేసుకు సంబంధించి జాదవ్ తరుపున వాదించడానికి న్యాయవాదిని ఏర్పాటు చేసుకునే హక్కు భారత్ కు ఉందని జడ్జిలు అభిప్రాయపడ్డారు.

2017లో కుల్ భూషణ్ జాదవ్ కు పాకిస్థాన్ మిలిటరీ కోర్టు మరణ శిక్ష విధించింది. 2016లో ఆయన్ను బలూచిస్తాన్ ప్రావిన్స్ లో పాక్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అయితే.. భూషణ్ కు వేసిన మరణశిక్షపై తీర్పును భారత్ అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్ చేసింది. పాక్ చర్యను తీవ్రంగా తప్పుపట్టింది.

కుల్ భూషణ్ అమాయకుడని.. ఆయనను దోషిగా చిత్రీకరించేందుకు పాక్ ప్రయత్నిస్తోందని భారత్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్, పాక్ తమ వాదనలను కూడా వినిపించాయి. తాజాగా… అంతర్జాతీయ కోర్టు కుల్ భూషణ్ మరణశిక్షను నిలిపివేయాలంటూ పాక్ ను ఆదేశించింది.

అంతర్జాతీయ కోర్టు తీర్పుపై కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు. ఇది భారత్ కు గొప్ప విజయమన్నారు. ఆమె ట్విట్టర్ లో స్పందించారు.


Read more RELATED
Recommended to you

Latest news