విపక్ష నేత రాహుల్ గాంధీకి ఉత్తర ప్రదేశ్ కోర్టు నోటీసులు ఇచ్చింది. కులగణన పై లోక్ సభలో ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలకు యూపీలోని బరేలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జనవరి 07వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. రాహుల్ వ్యాఖ్యలు దేశాన్ని విడదీసేలా ఉన్నాయంటూ.. కోర్టును ఆశ్రయించారు పంకజ్ పాఠక్ అనే వ్యక్తి. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఎన్నికల ప్రచారంలో కూడా రాహుల్ వ్యాఖ్యలను ప్రస్తావించారు పిటిషనర్.
తాము అధికారంలోకి వస్తే.. జనాభా ప్రాతిపదికన దేశ సంపదను పంచుతామన్నారు రాహుల్ గాంధీ. ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు, జనాభా ప్రతిపతికనే ఇస్తామన్నారు రాహుల్ గాంధీ. ఆ వ్యాఖ్యలు దేశాన్ని విడదీసేలా ఉన్నాయంటూ పంకజ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు.. జనవరి 07వ తేదీన విచారణకు హాజరు కావాలని రాహుల్ గాంధీ ని ఆశ్రయించింది కోర్టు.