అహ్మదాబాద్‌ లో కొత్త మాయ రోగం.. దాని గురించి వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!

-

అహ్మదాబాద్‌ లో ఓ కొత్త మాయ రోగం వచ్చేసింది. ముఖ్యంగా అహ్మదాబాద్ సిటీలోని ఆస్పత్రుల్లో ఉన్నట్టుండీ  పేషంట్ల సంఖ్య పెరుగుతుంది. పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నారు ఇతర రాష్ట్రాల వాసులు.హెల్త్ చెకప్‌‌ల కోసం ఆస్పత్రుల్లో అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు వందలాది మంది. అనుమానంతో  గుజరాత్ వైద్యులు ఆరా తీయగా ఆశ్చర్యపోయిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్పత్రుల్లో చేరుతున్న వాళ్లంతా పేషంట్లు కాదని.. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం వచ్చిన వాళ్ళు అని తేల్చిన వైద్యులు.

ఈనెల  13న రాత్రి, 14న రాత్రి ఆస్పత్రిలో ఉండేలా ప్లాన్ చేసుకుని … హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకున్నారు కొందరు. ఇండియా పాక్ మ్యాచ్ కి ఊహించనంత క్రేజ్ ఏర్పడింది. అహ్మదాబాద్ లో  హోటల్ రూమ్స్ ఎక్కడా దొరకడం లేదు. హోటళ్లు, రెస్టారెంట్లలో రూమ్స్ కి ఫుల్ డిమాండ్ పెరిగింది.  స్టార్ హోటల్స్ లో ఒక్క రాత్రికి అద్దె 50 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నారు. సాధారణ హోటల్ రూమ్స్.. అద్దెలు కూడా భారీగా పెంచారు. 40 రోజుల కిందటే  రూమ్స్ బుక్ అయ్యాయి. సాధారణ రోజుల్లో 1200, 1500 ఉండే రూమ్స్ ఇప్పుడు 10 వేల పైమాటే అని చెప్పాలి. హోటల్ గదుల్లో ఒక్క రాత్రి కోసం వేల రూపాయలు చెల్లించే బదులు, ఆస్పత్రిలో 5 నుంచి 10 వేల రూపాయలతో పని అయిపోతుందని క్రికెట్ ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు. పనిలో పనిగా చిన్నా చితకా హెల్త్ చెకప్ కూడా చేయించుకునేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news