వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ అనే సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే పలు బయోపిక్ సినిమాలను ఉన్నది ఉన్నట్లుగా తీసి మంచి గుర్తింపు పొందాడు వర్మ. తాజాగా వ్యూహం, శపథం అనే రెండు భాగాలతో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి గార్ల జీవిత చరిత్రలను ఆయన తెరకెక్కిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమా వెనుక ఎలాంటి వ్యూహం లేదు. ఈ మూవీలో నిజం మాత్రమే ఉంది. వ్యూహం రెండు భాగాలుగా వస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలతో ఈ రెండు సినిమాలు ఉంటాయి. నేను చాలా సౌమ్యుడిని. నేను ఎప్పుడు చంద్రబాబుని కలవలేదు. నాకు జగన్ గారు అంటే ఒక అభిప్రాయం ఉంది. అలాగే చంద్రబాబు గారు అంటే కూడా ఒక అభిప్రాయం ఉంది. కానీ నిజమనేది మాత్రమే ఈ సినిమాలో ప్రజలు చూస్తారు. జగన్ గారి మీద నాకు ఉన్న అభిప్రాయం వ్యూహం సినిమాలో కనపడుతుంది.
మిగతా వారిపై నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. నేను వేరే వాళ్ళ మీద సినిమా తీయమంటే తీయను.ఈ సినిమాలో నేను నమ్మిన నిజం ఉంది. పబ్లిక్ డొమైన్ లో ఉన్న జీవితాలను సినిమా తీయడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. నేను గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్, సర్కార్ వంటి సినిమాలు అలా తీసినవే. నేను జగన్ గారి మీద ఉన్న అభిమానంతో సినిమా తీశాను. కానీ ఇక్కడ ప్యాకేజ్ అనేదానికి ఆస్కారం లేదు. నాకు టీడీపీ గురించి కానీ, వైసీపీ గురించి కానీ, వేరే పార్టీ గురించి కానీ తెలీదు. నేను నమ్మిన నిజం మాత్రమే సినిమాలో చూపిస్తున్నాను. నా రీసెర్చ్ లో వెనుక ఏమి జరిగింది అనేదే ఈ సినిమా. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి పాత్ర కూడా ఉంది.