తెలుగు క్రీడాకారులకి అవార్డుల పంట !

-

ఈ ఏడాది నేషనల్ జాతీయ క్రీడా అవార్డులకు గాను జాబితా దాదాపు ఖరారైంది. ఈమేరకు తుది జాబితాని రిటైర్డ్‌ సుప్రీం కోర్టు జడ్జి ముకుందకమ్ శర్మ నేతృత్వంలోని అవార్డుల కమిటీ నిన్న క్రీడా మంత్రిత్వ శాఖకు అందజేసింది. ఈ జాబితాలో తెలుగు వాళ్ళు సత్తా చాటారు. బ్యాడ్మింటన్‌లో మంచి ఫాంలో ఉన్న అమలాపురానికి చెందిన సాత్విక్‌ సాయిరాజ్‌ క్రీడాపురస్కారం అర్జునకు ఎంపికయ్యాడు. అలానే వైజాగ్‌ కు చెందిన మహిళా బాక్సింగ్‌ కోచ్‌ ఉష ధ్యాన్‌చంద్‌ అవార్డుకు నామినేట్‌ అయింది.

ఇక మిగతా వాళ్ళ విషయనికి వస్తే హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మతోపాటు రెజ్లర్‌ వినేష్‌ ఫొగట్‌, మహిళల హాకీ కెప్టెన్‌ రాణీ రాంపాల్‌, టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ మనికా బాత్రా, రియో పారాలింపిక్స్‌ హైజంపర్‌ మరియప్పన్‌ తంగవేలు ప్రతిష్ఠాత్మక క్రీడాపురస్కారం రాజీవ్‌ ఖేల్‌రత్న కు ఎంపికయ్యారు. క్రీడల్లో అత్యున్నత పురస్కారంగా భావించే ఖేల్‌రత్నకు ఐదుగురి పేర్లను ప్రతిపాదించడం అవార్డుల చరిత్రలో ఇదే మొదటిసారి. కాగా వీరిలో ఒకరిని అవార్డ్ వరించనునుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version