ఆసియా కప్ 2022 లో టీమిండియా శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కొడుకు బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా హాజరయ్యారు. టీమిండియా విజయం సాధించిన అనంతరం.. చప్పట్లు కొడుతూ… జై షా వివాదంలో చిక్కుకున్నాడు. మ్యాచ్ అనంతరం లేచి.. చప్పట్లు కొడుతున్న జై షాకు.. ఆయన పక్కనే ఉన్న ఒక వ్యక్తి.. జాతీయ జెండాను పట్టుకోమ్మని.. ఇచ్చాడు.
కానీ జై షా మాత్రం.. జాతీయ జెండాను పక్కకు నెట్టేశారు. దీంతో ఇప్పుడు ఈ సంఘటన వివాదంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ మరియు టీఆర్‌ఎస్ పార్టీలు సెటైర్లు పేల్చుతున్నారు. అమిత్ షా.. దేశ భక్తి అంటూంటే.. జై షా మాత్రం జాతీయ జెండానే పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు ఈ వీడియోను చూసిన నెటిజన్లు. కాగా చివరి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ లో టీమిండియా.. 5 వికెట్ల తేడాతో పాక్ పై గెలిచింది. మొదట పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 147 పరుగుల వద్ద ఆలౌట్ కాగా.. ఇండియా ఆ లక్ష్యాన్ని 5 వికెట్ల తేడాతో ఛేదించింది.
India Vs Pakistan Match highlights !!
🔥 Amith shah son Jay Shah just rejected India flag…
🔥Why Amit Shah's son Jay Shah doesn't want to celebrate India's win with the tricolour.
Is he allergic towards Indian Flag?#IndiaVsPakistan #jayshah pic.twitter.com/I5ZrWGgtqp
— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) August 28, 2022