IND Vs AUS : తొలి ఇన్నింగ్స్ లో 337 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్

-

ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో భారత్ తో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్ లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 337 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకు ముందు భారత్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 180 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.  దీంతో 157 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా నిలిచింది. ట్రావిస్ హెడ్ (140) సెంచరీతో రాణించారు. భారత బౌలర్లు బుమ్రా, సిరాజ్ చెరో 4 వికెట్లతో రాణించారు.

ఆసీస్ బ్యాట్స్ మెన్ లలో ఖవాజా(13), నాథన్ మెక్ స్వీని (39), స్టీవ్ స్మిత్ (2) వంటి కీలక వికెట్లను నేలకూల్చాడు బుమ్రా. మార్నస్ లబూసేన్  (64) కీలక వికెట్ ను ఆంధ్రా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి తీశాడు. మిచెల్ మార్ష్ వికెట్ ను రవిచంద్రన్ అశ్విన్ తీశాడు. 140 పరుగులు సాధించిన ట్రావీస్ హెడ్ వికెట్ ను మహ్మద్ సిరాజ్ తీశాడు. అలాగే అలెక్స్ కార్వే, మిచెల్ స్టార్క్, బొలాండ్ వంటి బ్యాటర్లను సిరాజ్ పెవీలియన్ కి చేర్చాడు. దీంతో ఆస్ట్రేలియా 337 పరుగలకు ఆలౌట్ అయింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version