ఇండియా లోని అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ ప్లేయర్ లలో పివి సింధు ఎంతటి ప్రాముఖ్యత కలిసిన క్రీడాకారిణి అన్నది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒలింపిక్స్ లో భారతీయ జెండాను రెపరెపలాడించిన ఘనత ఆమెది. అలాంటిది ఈమెకు ఈ ఏడాది అస్సలు కలిసిరాలేదు. ఈ సంవత్సరం పివి సింధు మొత్తం దీనితో పాటుగా తొమ్మిది టోర్నమెంట్ లలో పోటీ పడగా, అందులో 7 టోర్నీలలో మొదటి రౌండ్ లోనే ఓడిపోయింది. ఇక తాజాగా జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మొదటి మరియు రెండు రౌండ్ లను గెలుచుకుని మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది అనుకుంటున్న తరుణంలోనే క్వార్టర్స్ లో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. సింధు క్వార్టర్స్ లో అమెరికాకు చెందిన బీవెన్ జాంగ్ చేతిలో వరుస సెట్ లలో 21 – 12 , 21 – 17 తేడాతో ఓడిపోయింది.
ఇక సింధు గత నెలలో తన కోచ్ ను మార్చుకున్నపటికీ ఆటలో మాత్రం మార్పు రాలేదు. మరి ఎప్పుడు సింధు ఫామ్ లోకి వచ్చి ఒక టైటిల్ ను అయినా గెలుచుకుంటుందో చూడాలి.