వరల్డ్ కప్ 2023 ఫైనల్ లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. కాస్త తడబడినప్పటికీ 240 పరుగులు చేయగలిగింది టీమిండియా. ఇందులో విరాట్ కోహ్లీ, కే.ఎల్.రాహుల్ కాస్త పర్వాలేదనిపించారు. మరోవైపు ఓపెనర్ గిల్, మహ్మద్ షమీ, సూర్యకుమార్ యాదవ్ చెత్త షాట్లకు పోయి ఔట్ అయ్యారు. కోహ్లీ కూడా క్లీన్ బౌల్డ్ కావడం కాస్త ఆశ్చర్యకరమైన విషయం అనే చెప్పాలి. కెప్టెన్ రోహిత్ 47, విరాట్ కోహ్లీ 54, కే.ఎల్.రాహుల్ 66 పరుగులు సాధించారు.
కీలక సమయంలో సూర్యకుమార్ కీలక ఇన్నింగ్స్ ఆడుతాడని అభిమానులందరూ భావించినప్పటికీ సూర్యకుమార్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. చివరికి కుల్దీప్, సిరాజ్ చివరి రెండు ఓవర్లలో 50 ఓవర్ల వరకు ఇన్నింగ్స్ ని నడిపించాడు.మధ్యలో షమీ కూడా కాస్త మంచిగానే ఆడినట్టు కనిపించిన చెత్త షాట్ ఆడబోయి పెవిలియన్ కు చేరాడు. మొత్తానికి టీమిండియా 50 ఓవర్లలో 240 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు 241 పరుగులు చేయాలి. ఈ కీలక పోరులో ఆస్ట్రేలియా టార్గెట్ ను రీచ్ అవుతుందా..? లేక టీమిండియా విజయం సాధిస్తుందా అనేది మరికొద్ది సేపట్లోనే తేలనుంది.