‘బ్రిజ్‌ భూషణ్‌ను జైల్లో పెట్టాలి’.. రెజ్లర్లకు బాబా రాందేవ్‌ మద్దతు

-

రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా గత కొంతకాలంగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. బ్రిజ్ భూషన్ మహిళా రైజ్లర్లను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో ఈ నిరసన కొనసాగుతోంది. ఆయణ్ను ఫెడరేషన్ అధ్యక్షుడిగా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రెజ్లర్లకు యోగా గురువు బాబా రాందేవ్‌ మద్దతు ప్రకటించారు. బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ను వెంటనే అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్‌ చేశారు.

రాజస్థాన్‌లోని భిల్వారాలో మూడు రోజుల పాటు జరుగుతున్న యోగా కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రెజ్లర్ల నిరసన పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ‘రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ టాప్‌ రెజ్లర్లు జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనకు కూర్చున్నారు. ఇలాంటి పరిస్థితి రావడం చాలా సిగ్గు చేటు. అలాంటి వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టాలి. అతడు తల్లులు, బిడ్డలు, అక్క చెల్లెళ్ల గురించి ప్రతిరోజూ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు. అతడి తీరు ఖండించదగింది’ అని రాందేవ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news