శతజయంతి ఒక్కసారి వస్తుందని వేడుకున్నా ఎన్టీఆర్ రాలేదు. టీడీ జనార్ధన్..!

-

సీనియర్ ఎన్టీఆర్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన పనికి సర్వత్ర విమర్శలు వెళ్లవెత్తుతున్న విషయం తెలిసిందే.అసలు విషయంలోకి వెళితే నట విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలు హైదరాబాదులో చాలా ఘనంగా జరిగాయి. తెలుగు చిత్ర సీమలోని ప్రముఖులంతా కూడా హాజరయ్యారు. ముఖ్యంగా వెంకటేష్, రామ్ చరణ్, అక్కినేని నాగార్జున , సుమంత్ ఇలా తదితర హీరోలు కార్యక్రమానికి హాజరై సీనియర్ ఎన్టీఆర్ గొప్పతనాన్ని కొనియాడారు. అయితే ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడం పై చర్చ జరిగింది.

దీనిపై తెలుగుదేశం పార్టీ నేత యంగ్ టైగర్ ఇంటికి వెళ్లి ఆహ్వానించిన వ్యక్తుల్లో ఒకరైన టీడీ జనార్ధన్ స్పందించారు.టిడి జనార్దన్ మాట్లాడుతూ.. చర్చ ఏమీ లేదు మేము పిలిచాము. ఆహ్వానించడానికి ప్రయత్నిస్తే వారం రోజుల తర్వాత టైం ఇచ్చారు.. సరే అని వెళ్తే అప్పుడు విషయం చెప్పాము.. కానీ ఆయనేమో అయ్యో ఆల్రెడీ నేను ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నాను అని చెప్పారు.. బాబు బర్తడే లు చాలా వస్తాయి.. తాత గారి శత జయంతి వేడుక ఒక్కసారే వస్తుంది అని చెప్పాము.. ఆరోజు ఉదయం అభిమానులకు కలవడానికి ఉంటున్నానని చెప్పారు.. ఒకవేళ ఉంటే రాత్రి వరకు ఉండి తెల్లవారుజామున బర్తడే చేసుకోమని రిక్వెస్ట్ చేశాము..

కానీ ఆయనకు షెడ్యూల్ కుదరలేదేమో.. 22 మంది కుటుంబాలతో వెళుతున్నాము.. ముందే అనుకున్నాము అని చెప్పారు. ఇక ఆయన నిర్ణయం ఆయనే తీసుకున్నారు అంటూ టీడీ జనార్ధన్ వివరించారు. ఇక కళ్యాణ్ రామ్ ను కూడా ఆహ్వానించామని అయితే ఆయన టూర్కు వెళ్లారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే నందమూరి అభిమానులు ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయి ఎన్టీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news