RCB అభిమానులకు బ్యాడ్ న్యూస్.. అలా జరిగితే బెంగళూరు ఇంటికే..!

-

వరుస విజయాలతో అనూహ్యంగా ప్లే ఆఫ్ రేసులోకి దూసుకొచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ నెల 18వ తేదీన చెన్నెతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే ఆర్సీబీ ఫ్లే ఆఫ్ రేసులో నిలుస్తోంది. లేదంటే లీగ్ దశ నుండి ఆర్సీబీ ఇంటి బాట పట్టాల్సింది ఉంటుంది. ఈ క్రమంలో ఆర్సీబీ అభిమానులకు వాతావరణ శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ప్లే ఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన చివరి మ్యాచు జరిగే శనివారం రోజున వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. కర్ణాటకలో ద్రోణి ప్రభావంతో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఒకవేళ శనివారం కూడా వర్షం కురిసి మ్యాచ్ రద్దు అయితే ఆర్సీబీ ప్లే ఆఫ్ ఆశలు గల్లంతైనట్లే. దీంతో ఈ నెల 18వ తేదీన బెంగళూరులో వర్షం పడొద్దని ఆర్సీబీ అభిమానులు కోరుకుంటున్నారు.

ఇక మే 18 అంటే విరాట్ కోహ్లీకి పూనకాలు అనే చెప్పాలి. కొన్నేళ్లుగా ఆ తేదీన జరిగినటువంటి మ్యాచ్ ల్లో అతడు ఆకాశమే హద్దుగా చెలరేగుతుండటంతో బెంగళూరుకు ఓటమి అన్నదే లేదు. మే 18న పలు సీజన్ లలో నాలుగు మ్యాచ్ లు ఆడిన కోహ్లీ 56, 27, 113, 100 రన్స్ చేసి ఆర్సీబీ జట్టుకు విజయాన్ని అందించారు. అదే తేదీన శనివారం చెన్నై సూపర్ కింగ్స్ తో డూ ఆర్ డై మ్యాచ్ లో కోహ్లీ చెలరేగి జట్టును ప్లే ఆప్స్ కు చేస్తారంటూ అతని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news