కొత్త సెలక్షన్ కమిటీని ప్రకటించిన బీసీసీఐ..మరోసారి అతనికే ఛాన్స్

-

టీమిండియాను విజయ భాటలో నడిపేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారత క్రికెట్ జట్టు సీనియర్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ గా చేతన్ శర్మ మరోసారి నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి శనివారం వెల్లడించింది.

చేతన్ తో పాటు ఈ సెలక్షన్ కమిటీలో శివ్ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్ కు చోటు దక్కింది. కాగా టీ 2022లో రోహిత్ సేన దారుణ వైఫల్యం నేపథ్యంలో సెలక్షన్ కమిటీని బీసీసీఐ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చేతన్ శర్మ చైర్మన్ గా ఉన్న కమిటీని రద్దుచేసి ఖాళీ స్థానాల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ క్రమంలో మరోసారి చేతన్ శర్మ వైపే మొగ్గు చూపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version