బాక్సింగ్‌లో క్వార్టర్స్ పైనల్‌కు భారత్

-

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. తాజాగా బ్యాక్సింగ్‌లో భారత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఫ్రీ క్వార్టర్స్ రెండో రౌండ్‌లో జర్మనీ క్రీడాకారిణి అపెట్‌పై లవ్లీనా విజయం సాధించారు. 69 కిలోల విభాగంతో అపెట్‌పై 2-3 తేడాతో లవ్లీనా గెలిచారు. మూడు రౌండ్లలోనూ ల‌వ్లీనా ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. మొదటి రౌండ్‌లో లవ్‌లీనాకు బై దొరకడంతో నేరుగా రెండో రౌండ్‌కి అర్హత సాధించారు. మూడు రౌండ్ల‌లోనూ ముగ్గురు జ‌డ్జీలు ల‌వ్లీనాకు 10 స్కోరు ఇవ్వ‌గా.. ఇద్ద‌రు 9 ఇచ్చారు.

అంతకుముందు భారత హాకీ జట్టు ఘన విజయం సాధించింది. తొలి క్వార్డర్ ముగిసేసరికి స్పెయిన్‌పై ఆధిక్యం సాధించింది. 2-0 తేడాతో భారత్ ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి 15 నిమిషాల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. పూల్ ఏ- మూడో మ్యాచ్‌లో స్పెయిన్‌పై 3-0తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే సెయిన్ పై భారత్ పట్టు సాధించింది. తొలి కార్డర్స్‌లోనే రెండు గోల్స్ చేసింది. నాలుగో క్వార్టర్‌లోనే మూడో గోల్స్ చేసింది. రూపిందర్ పాల్ రెండు గోల్స్ చేసి అదరగొట్టారు. 14వ నిమిషంలో సిమ్రన్ జీత్ సింగ్ గోల్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news