భార‌త క్రికెట్‌లో అగ్గి రాజేస్తున్న రోహిత్ అన్‌ఫాలో వివాదం.. కోహ్లితో విభేదాలు తారా స్థాయికి..?

-

చాలా కాలం కింద‌టే రోహిత్ శ‌ర్మ కోహ్లిని ఇన్‌స్టాగ్రాంలో అన్‌ఫాలో అయ్యాడు. ఇక తాజాగా కోహ్లి భార్య అనుష్క శ‌ర్మ‌ను కూడా రోహిత్ ఇన్‌స్టాగ్రాంలో అన్‌ఫాలో అయ్యాడు. దీంతో రోహిత్ శ‌ర్మ, అత‌ని భార్య రితికాల‌ను కూడా అనుష్క శ‌ర్మ ఇన్‌స్టాగ్రాంలో అన్‌ఫాలో అయింద‌ట‌.

భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ల మ‌ధ్య గ‌త కొద్ది రోజులుగా విభేదాలు త‌లెత్తాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం విదిత‌మే. అయితే అదిప్పుడు తారాస్థాయికి చేరుకుంద‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 టోర్నీ సెమీ ఫైన‌ల్‌లో న్యూజిలాండ్ చేతిలో భార‌త్ ఓడిపోవ‌డంతో కోహ్లి, రోహిత్‌ల మ‌ధ్య విభేదాలు త‌లెత్తాయ‌ని తెలుస్తుండ‌గా.. ఈ ఇద్ద‌రి మ‌ధ్యా ఇప్పుడు మ‌రింత అగ్గి రాజుకుంద‌ని స‌మాచారం. తాజాగా రోహిత్ శ‌ర్మ కోహ్లి భార్య అనుష్క శ‌ర్మ‌ను ఇన్‌స్టాగ్రాంలో అన్‌ఫాలో కొట్ట‌డంతో.. ఈ వివాదం నిజ‌మేన‌ని అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

controversies raised between rohith sharma and kohli

చాలా కాలం కింద‌టే రోహిత్ శ‌ర్మ కోహ్లిని ఇన్‌స్టాగ్రాంలో అన్‌ఫాలో అయ్యాడు. ఇక తాజాగా కోహ్లి భార్య అనుష్క శ‌ర్మ‌ను కూడా రోహిత్ ఇన్‌స్టాగ్రాంలో అన్‌ఫాలో అయ్యాడు. దీంతో రోహిత్ శ‌ర్మ, అత‌ని భార్య రితికాల‌ను కూడా అనుష్క శ‌ర్మ ఇన్‌స్టాగ్రాంలో అన్‌ఫాలో అయింద‌ట‌. త‌న‌ను, త‌న భ‌ర్త కోహ్లిని వారు ఫాలో కాక‌పోతే.. తానెలా వారిని ఫాలో అవుతాన‌ని చెప్పి అనుష్క శ‌ర్మ వారి అకౌంట్ల‌ను అన్‌ఫాలో అయింద‌ట‌. దీంతో ఈ వివాదం ఇప్పుడు మ‌రింత పెద్ద‌దిగా అవుతోంది.

అయితే రోహిత్ శ‌ర్మ‌, కోహ్లిల మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని బీసీసీఐ ఓవైపు చెబుతున్నా.. వారి మ‌ధ్య విభేదాలు ఏర్పడ్డాయ‌ని అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు. ఇటీవలే విండీస్ టూర్‌కు వెళ్ల‌నున్న భార‌త జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించ‌గా.. మొద‌ట ఆ టూర్‌కు రోహిత్ శ‌ర్మ‌ను కెప్టెన్‌గా అనుకున్నార‌ట‌. కానీ కెప్టెన్సీని రోహిత్‌కు అప్ప‌గించ‌డం ఇష్టంలేని కోహ్లి తాను కూడా ఆ టూర్‌కు వ‌స్తాన‌ని చెప్ప‌డంతో.. సెలెక్ట‌ర్లు కోహ్లినే విండీస్ టూర్‌కు కెప్టెన్‌గా నియ‌మించార‌ట‌. అందుక‌నే ఇప్పుడు రోహిత్‌, కోహ్లిల మ‌ధ్య విభేదాలు మ‌రింత ముదిరాయ‌ని తెలుస్తోంది. అయితే మ‌రోవైపు మెజారిటీ అభిమానులు మాత్రం రోహిత్ శ‌ర్మ‌కే టీమిండియా కెప్టెన్సీని అప్ప‌గించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. మ‌రి ముందు ముందు ఈ ఇద్ద‌రి మ‌ధ్య వివాదం ఇంకెన్ని మ‌లుపులు తిరుగుతుందో.. బీసీసీఐ దీనికి చెక్ పెడుతుందో, లేదో చూడాలి.. ఏది ఏమైనా.. వీరి మ‌ధ్య ఉన్న త‌గాదా బీసీసీఐకి కొత్త త‌ల‌నొప్పిని తెచ్చిపెడుతోంద‌ట‌.. దీన్ని బీసీసీఐ ఎలా సాల్వ్ చేస్తుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది..!

Read more RELATED
Recommended to you

Latest news