ఇంగ్లాండ్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ టెస్ట్ సిరీస్ లో రెండు టెస్ట్ లలోనూ ఓడిపోయి అవమానభారంతో స్త్రోకేస్ సేన రగులుతోంది. రెండు టెస్ట్ లలోనూ విజయం అంచులవరకూ వచ్చి ఓటమి పాలైంది. దీనితో కీలక నిర్ణయాలు దిశగా ఇంగ్లాండ్ కోచింగ్ స్టాఫ్ దూసుకువెళ్లింది. అందులో భాగంగా రేపటి నుండి జరగనున్న మూడవ టెస్ట్ కు ఒక రోజు ముందుగానే ఆస్ట్రేలియాతో తలపడనున్న తుది జట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్ కు బ్యాట్స్మన్ ఓలీ పొప్, బౌలర్లు జోష్ టంగ్ మరియయు జేమ్స్ అండర్సన్ లపైన వేటు వేసింది. వీరి ముగ్గురు స్థానంలో తుది జట్టులోకి మొయిన్ అలీ, క్రిస్ వోక్స్ మరియు మార్క్ వుడ్ లను తీసుకుంది. మరి వీరి రాకతో అయినా ఇంగ్లాండ్ జట్టు అద్భుతంగా రాణించి ఈ టెస్ట్ మ్యాచ్ ను గెలుచుకుని మిగిలిన రెండు టెస్ట్ లను ఆసక్తికరంగా మారుస్తారా చూడాలి.
యాషెస్ టెస్ట్ సిరీస్: ఓటమి దెబ్బతో జట్టును మార్చేసిన ఇంగ్లాండ్…
-