WORLD CUP 2023: ఇంగ్లాండ్ ముందు బోల్తా పడుతున్న ఆస్ట్రేలియా…!

-

ఈ రోజు వరల్డ్ కప్ లో జరుగుతున్న రెండవ మ్యాచ్ లో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా జట్లు పోటీ పడుతున్నాయి. మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ వరుస విజయాలతో జోరుమీదున్న ఆస్ట్రేలియాను ముప్పతిప్పలు పెడుతోంది. గత మ్యాచ్ లో చెలరేగిన వార్నర్ (15) మరియు ట్రావిస్ హెడ్ (11) లు ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలర్లు దెబ్బకు తోకముడిచారు. ఆ తర్వాత స్మిత్ (44) మరియు లాబుచెన్ (71) లు ఆదుకోవాలని చూసినా కీలక సమయంలో ఇద్దరూ అవుట్ కావడంతో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ పడిపోయింది. ఇక ఇంగ్లీష్ (3) కూడా విఫలం అయ్యాడు, గ్రీన్ (47) మాత్రం పర్వాలేదనిపించినా ఆ స్కోర్ సరిపోదు. అలా ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చి స్వల్ప స్కోర్ కె ఇన్నింగ్స్ ను ముగించేలా కనిపిస్తోంది.

ప్రస్తుతం ఆస్ట్రేలియా 250 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి ఆల్ అవుట్ కావడానికి చాలా దగ్గరగా ఉంది. ఇంగ్లాండ్ బౌలర్లు వోక్స్, వుడ్, రషీద్ లు తలో 2 వికెట్లు తీసుకుని సంయుక్తంగా రాణించి ఆస్ట్రేలియాను భయపెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news