వరస విజయాలతో టీమిండియా యమజోరు మీద ఉంది. స్వదేశంలో వెస్టిండీస్ తో జరిగిన టీ20, వన్ డే సిరీస్ లను క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న సిరీస్ లో ఇప్పటికే టీ20 లను క్లీన్ స్వీప్ చేసింది. ఇదిలా ఉంటే మరోవైపు టీమిండియా ఐర్లాండ్ టూర్ షెడ్యూల్ ఖరారైంది.
వచ్చే ఐపీఎల్ సీజన్ తరువాత ఐర్లాండ్ షెడ్యూల్ ఖరారైంది. జూన్ 26,28 తేదీల్లో భారత్, ఐర్లాండ్ మధ్య రెండు టీ20 మ్యాచులు జరుగనున్నాయి. ఈ విషయాన్ని క్రికెట్ ఐర్లాండ్ కూడా ధ్రువీకరించింది. అయితే ఈ సిరీస్ కు కొంతమంది స్టార్లు అందుబాటులో ఉండరని తెలుస్తోంది. ఈ సిరీస్ కు రోహిత్, కోహ్లీ, పంత్, బూమ్రా అందుబాటులోకి ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో మిగిలిన టెస్ట్ ను జూలైలో నిర్వహిస్తుండటంతో ముందస్తుగా అక్కడికి వెళ్లనున్నాట్లు తెలుస్తోంది. జూనియర్లతోనే ఐర్లాండ్ సిరీస్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.