ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ బాదిన బెల్..

-

ఇంగ్లాండ్ క్రికెట్ లో ప్రస్తుతం విటాలిటీ బ్లాస్ట్ మరియు కౌంటీ మ్యాచ్ లు జరుగుతున్నాయి.
బ్లాస్ట్ కొన్ని మ్యాచ్ ల అనంతరం గ్యాప్ ఇచ్చి కౌంటీ మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న లవ్ ఇన్సూరెన్సు కౌంటీ మ్యాచ్ లో భాగంగా కెంట్ మరియు నార్తప్టం షైర్ ల మధ్యన మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో కెంట్ క్రికెట్ టీం కు చెందిన ప్లేయర్ డేనియల్ బెల్ డ్రంమాండ్ ఒకే ఇన్నింగ్స్ లో 300 పరుగులు చేసి ఔరా అనిపించాడు. బ్లాస్ట్ లోనూ అదరగొడుతున్న ఈ ప్లేయర్ కౌంటీలోనూ తన సత్తా చాటుతున్నాడు. ఇతను 439 బంతులను ఎదుర్కొని 300 పరుగులు సాధించాడు. ఇతని ఇన్నింగ్స్ లో మొత్తం 28 ఫోర్లు మరియు ఒక సిక్సు ఉంది.

ఈ ఇన్నింగ్స్ వలన కెంట్ ప్రత్యర్థి కన్నా 384 పరుగులు లీడ్ లో ఉంది. మరి బెల్ ఆడిన ఈ ఇన్నింగ్స్ తన జట్టుకు విజయాన్ని అందిస్తుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news