Rohit sharma : వైర‌ల్ అవుతున్న హిట్ మ్యాన్ న్యూ లుక్

-

టీమిండియా ప‌రిమిత ఓవ‌ర్ల కెప్టెన్ రోహిత్ శ‌ర్మ న్యూ లుక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. గాయం కార‌ణంగా సౌతాఫ్రికా టూర్ కు దూరం అయిన రోహిత్ శ‌ర్మ ప్ర‌స్తుతం జాతీయ క్రికెట్ అకాడ‌మీ రిహాబిటేష‌న్ లో ఉంటున్నాడు. అయితే గాయం, ఫిట్ నేస్ లేమీ కార‌ణంగా రోహిత్ శ‌ర్మ గ‌త కొద్ది రోజుల నుంచి క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. అయితే ఈ స‌మ‌యాన్ని రోహిత్ శ‌ర్మ వృథా చేయ‌కుండా త‌న అధిక బ‌రువును త‌గ్గించుకుంటున్నాడు.

నేష‌నల్ అకాడ‌మీ రిహాబిటేష‌న్ లో గ‌త కొద్ది రోజుల నుంచి తీవ్రమైన క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. దీంతో రోహిత్ శ‌ర్మ స‌న్న‌బ‌డిన‌ట్టు తెలుస్తుంది. తాజా గా ఆయ‌న ఒక ఫోటోను కూడా సోష‌ల్ మీడియా ద్వార అభిమానుల‌తో పంచుకున్నాడు. ఈ న్యూ లుక్ లో హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ అద‌ర‌కొడుతున్నాడు. ఈ న్యూ లుక్ రోహిత్ శ‌ర్మ కాస్త స‌న్న బ‌డిన‌ట్టు క‌నిపిస్తుంది. అలాగే క్లీన్ షేవ్ కూడా చేసుకుని ఉన్నాడు. దీంతో రోహిత్ శ‌ర్మ చాలా యంగ్ గా క‌నిపిస్తున్నాడు.

 

ప్ర‌స్తుతం రోహిత్ శ‌ర్మ న్యూ లుక్ సోష‌ల్ మీడియా లో తెగ వైర‌ల్ అవుతుంది. అంతే కాకుండా అభిమానులు కామెంట్ల వ‌ర్షం కురుపిస్తున్నారు. రిహాబిటేష‌న్ సెంట‌ర్ బాగానే వ‌ర్క్ అవుట్ అయింద‌ని కొంద‌రు, అలాగే రోహిత్ శ‌ర్మ చాలా యంగ్ గా క‌నిపిస్తున్నాడ‌ని మ‌రి కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news