ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు భయపెడుతున్నాయి. అన్ని దేశాల్లో కూడా కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికా, యూరోపియన్ దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఇండియాలో కూడా క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇదిలా ఉంటే ఓమిక్రాన్ కేసులు పెరుగుతుదల కలవరపెడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులను పరిశీలిస్తే ఇప్పటి వరకు 5,52,191 నమోదయ్యాయి. ఇందులో ఒక్క యూకేలోనే 3 లక్షలకు చేరువలో ఓమిక్రాన్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఒమిక్రాన్ మరణాల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 115 మంది మరణించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో ఓమిక్రాన్ కేసుల సంఖ్యే ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
ఇదిలా ఉంటే ఇండియాలో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. రోజూవారీ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువలో వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఓమిక్రాన్ కేసుల సంఖ్య 4 వేలను దాటింది 5 వేలకు చేరువలో ఉంది. ఇప్పటి వరకు ఓమిక్రాన్ వేరింట్ సోకి అధికారికంగా దేశంలో ఒకరే మరణించారు.