నిన్న నరేంద్ర మోదీ స్టేడియం లో ఆయన ప్రత్యక్షముగా మ్యాచ్ చూస్తుండగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా 6 వికెట్ల తేడాతో ఓడిపోయి రన్నర్ అప్ గా నిలిచింది. ఇండియా ఇన్నింగ్స్ లో మొదటి పది ఓవర్ లలో ఆట మనకు అనుకూలంగానే ఉన్నా, ఆ తర్వాత రోహిత్, శ్రేయస్ వికెట్లు కోల్పోవడంతో డిఫెన్స్ లో పడిపోయింది. 203 పరుగుల వద్ద ఉండగా జడేజా వికెట్ కోల్పోవడంతో క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ తడబడుతూ ఆడాడు. సూర్య క్రీజులోకి వచ్చిన సమయానికి ఇంకా తొమ్మిది ఓవర్లు ఉన్నాయి. సూర్య టాలెంట్ కు ఈ ఓవర్ లలో జట్టుకు ఈజీ గా 90 పరుగులు సాధించి పెట్టగలడు. కానీ సూర్య కుమార్ యాదవ్ అస్సలు బంతిని మిడిల్ చేయడంలో చాలా ఇబ్బంది పెట్టాడు. చివరికి సూర్య 28 బంతులను మాత్రమే ఎదుర్కొని 1 ఫోర్ సహాయంతో 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
ఇది నిజంగా మ్యాచ్ టార్గెట్ పై ప్రభావం చూపి ఓటమి ఒక కారణమని చెప్పాలి. ఇండియా వరల్డ్ కప్ జట్టులో స్థానం సంపాదించిన సూర్య కీలక సమయంలో రాణించి విజయాన్ని అందించే అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నాడని చెప్పాలి.