IND vs WI : వైట్ వాష్‌పై గురి.. నేడే 3వ వ‌న్డే

-

వెస్టిండీస్ తో జ‌రుగుత‌న్న వ‌న్డే సిరీస్ వైట్ వాష్ పై టీమిండియా క‌న్నేసింది. మూడు వ‌న్డేల ఈ సిరీస్ లో టీమిండియా 2-0 తో ఇప్ప‌టికే కైవసం చేసుకుంది. కాగ నేడు జ‌ర‌గ‌నున్న మూడో వ‌న్డేలో కూడా విజ‌యం సాధించి క్లీన్ స్వీప్ చేయాల‌ని రోహిత్ సేన ఆరాట ప‌డుతుంది. అలాగే ఈ మ్యాచ్ గెలిచి.. వైట్ వాష్ ప‌లు రికార్డుల‌ను సృష్టించాల‌ని టీమిండియా చూస్తుంది. ఈ సిరీస్ వైట్ వాష్ చేస్తే.. కెప్టెన్ గా రోహిత్ కు తొలి విజ‌యం ద‌క్కుతుంది.

పూర్తి కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించిన మొద‌టి సిరీస్ నే క్లీన్ స్వీప్ చేసిన కెప్టెన్ గా రోహిత్ రికార్డు సృష్టిస్తాడు. అలాగే వెస్టిండీస్ స్వదేశంలో తొలి సారి క్లీన్ స్వీప్ చేసిన జట్టుగా రికార్డు నెల‌కొల్పుతారు. అలాగే ఈ మ్యాచ్ లో గెలిచి ప‌రువు ద‌క్కించుకోవాల‌ని వెస్టిండీస్ భావిస్తుంది. అలాగే వెస్టిండీస్ ఇప్ప‌టి వ‌ర‌కు 19 వ‌న్డే సిరీస్ లు క్లీన్ స్వీప్ చేసుకుంది. ఇప్పుడు ఈ మ్యాచ్ ఓడితే.. 20వ క్లీన్ స్వీప్ అవుతుంది. దీంతో ఈ చెత్త రికార్డు నుంచి త‌ప్పించుకోవాల‌ని వెస్టిండీస్ భావిస్తుంది.

కాగ సిరీస్ లో నామ‌మాత్ర‌పు మ్యాచ్ కావ‌డంతో టీమిండియా కొత్త వారికి అవ‌కాశం ఇవ్వ‌నుంది. అలాగే కరోనా నుంచి కోలుకున్న శిఖ‌ర్ ధావ‌న్ ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడు. అంతే కాకుండా రోహిత్ – ధావ‌న్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version