ఇండియా బ్యాటింగ్ సూపర్: ఆస్ట్రేలియా బౌలర్ ప్రసంశలు

-

టీం ఇండియాతో జరిగే నాలుగు మ్యాచ్‌ ల టెస్ట్ సిరీస్‌ కు గానూ ఆస్ట్రేలియా జట్టుకి ఎంపిక అయిన ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ మిచెల్ స్వెప్సన్‌ కీలక వ్యాఖ్యలు చేసాడు. తుది జట్టులో అతను ఎంపిక కాకపోయినా సరే… అతను మాత్రం టీం ఇండియా బ్యాటింగ్ లైనప్ పై కీలక వ్యాఖ్యలు చేసాడు. నాథన్ లియాన్ జట్టు ప్రధాన స్పిన్నర్‌ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే సవాలుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.

‘ప్రపంచ స్థాయి’ భారతీయ బ్యాటింగ్ లైనప్‌ పై పోరాటం చేయడానికి గానూ తాను రెడీ గా ఉన్నా అన్నాడు. వారి బ్యాటింగ్ పై బౌలింగ్ చేసే అవకాశం రావడం నాకు ఒక పరీక్షా అన్నాడు. నేను చాలా ఎదురు చూస్తున్నా అన్నాడు. విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు అని అతను పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news