రెండు నెలలుగా అభిమానులని అలరిస్తూ.. వస్తున్న ఐపీఎల్ క్లైమాక్స్ కు చేరుకుంది. లీగ్ మ్యాచ్ లు అన్ని పూర్తి మంగళవారం మే 21 నుంచి ప్లే ఆప్స్ మ్యాచ్ లు మొదలుకానున్నాయి. కోల్ కతా నైట్ రైడర్స్ 20 పాయింట్లతో పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 17 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. 17 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ మూడో స్థానానికి పరిమితమైతే..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 పాయింట్లతో ప్లే ఆఫ్ స్థానాన్ని దక్కించుకున్న నాలుగో జట్టుగా నిలిచింది.
ఐపీఎల్ ప్లే ఆప్స్ షెడ్యూల్ :
కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్ హెచ్ మే 21 అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన కేకేఆర్, సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో తలపడతాయి. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు వెళ్తుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుతో మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ కి వెళ్తుంది.
ఎలిమినేటర్ :
ఎలిమినేటర్ మ్యాచ్ RR Vs RCB మధ్య మే 22 బుధవారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టుతో క్వాలిఫయర్ 2 ఆడుతుంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టుకు క్వాలిఫైయర్ 2 కి బెర్త్ ఖరారు అవుతుంది.
క్వాలిఫైయర్ 2 :
క్వాలిఫైయర్ 1లో ఓడిన జట్టు Vs ఎలిమినేటర్ విజేతకు మే 24న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు వెళ్తుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
ఫైనల్ :
క్వాలిఫయర్ 1లో విజేత క్వాలిఫయర్ 2లో విజేత మే 26న ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఫైనల్ జరుగుతుంది.