జూనియర్ ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ చెప్పిన నారా లోకేష్

-

ఇవాళ మే 20, 2024 టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ లోకేశ్కు మేనమామ కుమారుడు అనే విషయం తెలిసిందే. దీంతో లోకేశ్కు ఎన్టీఆర్ బావ అవుతాడు.

గత ఏడాది లోకేశ్ ఎన్టీఆర్ కి బావ హ్యపి బర్త్ డే అని ట్విట్టర్ వేదిక తెలిపారు. ఈ సంవత్సరం కూడా జూ.ఎన్టీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు స్టార్ హీరోలు రామ్ చరణ్, మహేశ్ బాబు.. ఎన్టీఆర్ కి బర్త్ డే విషేస్ చెబుతూ పోస్టులు పెట్టారు. ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news