ఐపీఎల్ 2022 : కోల్‌క‌త్త బౌలింగ్ కోచ్‌గా భ‌ర‌త్ అరుణ్

ఈ ఏడాది రాబోయే ఐపీఎల్ కోసం అన్ని జ‌ట్లు సిద్ధం అవుతున్నాయి. త‌మ కోచ్ ల‌ను, మెంట‌ర్ ల‌ను అన్ని ఫ్రొంచైజ్ లు రెడీ చేసుకుంటున్నాయి. తాజా గా కోల్‌క‌త్త నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆ జ‌ట్టు బౌలింగ్ కోచ్ గా టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ భ‌ర‌త్ అరుణ్ ను నియ‌మిస్తు నిర్ణ‌యం తీసుకుంది. ఈ విష‌యాన్ని కేకేఆర్ యాజ‌మాన్యం అధికారికంగా త‌మ ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ప్ర‌క‌టించింది.

అయితే భ‌ర‌త్ అరుణ్ ఇటీవ‌లే టీమిండియా బౌలింగ్ కోచ్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్నాడు. తాజా గా కేకేఆర్ కు బౌలింగ్ కోచ్ గా బాధ్య‌త‌లు తీసుకున్నాడు. దీనికి భ‌ర‌త్ అరుణ్ స్పందిస్తు.. కోల్‌క‌త్త నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తుంద‌ని అన్నారు. కేకేఆర్ తో క‌లిసి ప‌ని చేయ‌డానికి ఆస‌క్తిగా ఎద‌రుచూస్తున్నాని అన్నారు. కాగ ఐపీఎల్ 2022 కోసం వ‌చ్చే నెల 12, 13 తేదీల‌లో మెగా వేలం జ‌ర‌గ‌నుందని ఇటీవ‌లే బీసీసీఐ అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది.