IPL 2024 CSK Vs LSG : తొలి వికెట్ కోల్పోయిన చెన్నై

-

ఐపీఎల్ 2024లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జేయింట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో సీఎస్ కే రెండు మార్పులతో బరిలోకి దిగింది. లక్నో కేవలం ఒకే ఒక మార్పుతో బరిలోకి వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి మొయిన్ అలీ, దీపక్ చాహర్ వచ్చారు. అలాగే లక్నో తరపున మాట్ హెన్రీ ఐపీఎల్ ఆరంగేట్రం చేశాడు.

తొలుత బ్యాటింగ్ కి  చెన్నై ఓపెనర్లు రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్  వచ్చారు. రుతురాజ్ క్రీజులో ఉండగా.. ఓపెనర్ రచిన్ రవీంద్ర మోసిన్ ఖాన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. రచిన్ రవీంద్ర డకౌట్ కావడంతో చెన్నై అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. కెప్టెన్ గైక్వాడ్, రహానే ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం 4 ఓవర్లకు చెన్నై జట్టు 29-1 పరుగులు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version