గబ్బా టెస్టులో ఆసీస్ కు బిగ్ షాక్ తగిలింది. 5 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. బ్రిస్బేన్ టెస్టులో భారత బౌలర్లు రెచ్చిపోయి.. బౌలింగ్ చేస్తున్నారు. ఇక భారత బౌలర్ల దెబ్బకు ఐదు వికెట్స్ కోల్పోయింది ఆస్ట్రేలియా.. ఉస్మాన్ ఖవాజా (8), మార్నస్ లబుషేన్ (1), నాథన్ మెక్‌స్వీనీ (4), మిషెల్ మార్ష్ (2), స్టీవ్ స్మిత్ (4) పరులుగు చేసి ఔట్ అయ్యారు.
ఇలాంటి నేపథ్యంలోనే.. మరోసారి ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియాను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం క్రీజ్‌లో అలెక్స్ కేరీ, ట్రావిస్ హెడ్ ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 39/5 గా నమోదు అయింది. ఇప్పటి వరకు 12 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా 39 పరుగులు చేసింది. దీంతో 241 పరుగుల లీడ్ లోకి వచ్చింది ఆస్ట్రేలియా. అయితే.. ఇవాళ వర్షం పడే ఛాన్స్ ఉన్న తరుణంలోనే… 300 పరుగులు చేసి.. డిక్లేర్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఆసీస్.