క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 18వ సీజన్ ప్రారంభమైంది. ఆరంభ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా.. కోల్ కతా బ్యాటింగ్ కు దిగింది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఈ రెండు జట్లు 34 సార్లు తలపడగా.. కేకేఆర్ 20, ఆర్సీబీ 14 మ్యాచ్‌ల్లో గెలిచిన విషయం తెలిసిందే.
ఇక అంతకుముందు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఐపీఎల్ 2025 ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో షారుక్ ఖాన్ తో కలిసి విరాట్ కోహ్లీ స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ మ్యాచ్ లో కోల్ కతా టీమ్ నుంచి క్వింటన్ డికాక్, వెంకటేశ్ అయ్యర్, రహానే, రింకు సింగ్, రఘువంశీ, సునీల్ నరైన్, ఆండ్రూ రసెల్, రమణ్‌దీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఆడుతున్నారు.