డీలిమిటేషన్​కు విధివిధానాలు ఖరారు కాలేదు : కిషన్ రెడ్డి

-

కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్​ను వ్యతిరేకిస్తూ చెన్నైలో డీఎంకే నేతృత్వంలో తమిళనాడు సీఎం స్టాలిన్​ అధ్యక్షతన పార్టీలకతీతంగా అఖిలపక్ష భేటీ జరిగిన విషయం తెలిసిందే. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ అఖిలపక్ష పార్టీలన్నీ ముక్తకంఠంతో దీన్ని వ్యతిరేకించాయి. ఇక ఈ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. లోక్​సభ సీట్లు పెంచవద్దని, రాష్ట్రాల్లో అంతర్గత డీలిమిటేషన్​ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే డీలిమిటేషన్ పై జరిగిన ఈ సదస్సుపై రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు.

అనవసరంగా ఈ పార్టీలన్నీ రాద్ధాంతం చేస్తున్నాయని తెలంగాణ బీజేపీ నేతలు విమర్శించారు. ఈ నేపథ్యంలో దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. డీలిమిటేషన్ కు విధివిధానాలు ఖరారు కాలేదని ఆయన తెలిపారు. కొంది తీరు ఆలు లేదు.. చూలు లేదు.. అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇంకా విధివిధానాలు ఖరారు కాకముందే దక్షిణాదికి అన్యాయం అంటూ కొన్ని రాజకీయ పార్టీలు అపోహలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. పైకి డీలిమిటేషన్ అని చెబుతున్నా లోపల వారి అజెండా వేరే ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news