BREAKING : IPLలో ఇర్ఫాన్ పఠాన్ బ్యాన్

-

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానున్న సమయంలో ఐపీఎల్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా మాజీ క్రికెటర్​ ఇర్ఫాన్‌ పఠాన్‌పై వేటు వేసింది. అతడిని కామెంటరీ ప్యానెల్ నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించింది. 2025 సీజన్​కుగానూ​ ఐపీఎల్ కమిటీ కామెంటరీ ప్యానెల్​ను శుక్రవారం ప్రకటించగా.. ఇందులో ఇర్ఫాన్ పఠాన్ పేరు లేకపోవడం గమనార్హం.

ఇర్ఫాన్ పఠాన్ పలు ఐపీఎల్‌ సీజన్లలో కామెంటేటర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. కామెంటరీ చేస్తున్న సమయంలో ఇర్ఫాన్​ కావాలనే కొంతమంది ప్లేయర్లను టార్గెట్ చేసి కామెంట్స్ చేస్తున్నట్లు కమిటీకి ఫిర్యాదులు రావడంతో అతణ్ని ప్యానెల్ నుంచి తొలగించినట్లు సమాచారం. అయితే ఐపీఎల్ కామెంటరీ ప్యానెల్‌ నుంచి తొలగించిన వెంటనే ఇర్ఫాన్‌ యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించాడు.  ‘మైక్‌ ఆన్‌, ఫిల్టర్‌ ఆఫ్‌. ఇర్ఫాన్‌తో నేరుగా మాట్లాడుదాం. నిజాలే మాట్లాడుకుందాం’ అంచూ తన యూట్యూబ్ ఛానెల్ గురించి సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు. ఇర్ఫాన్ పఠాన్ ఛానెల్ సామాజిక మాధ్యమాలైన  ఇన్​స్టా, ఫేస్​బుక్, యూట్యూబ్​లో అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version