గంభీర్‌ను కలిసిన జై షా.. ‘టీమిండియా హెడ్ కోచ్‌’ పదవిపై మళ్లీ చర్చ!

-

ఐపీఎల్‌లో కోల్‌కతాను ఛాంపియన్‌గా మార్చడం వెనుక భారత మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్‌ కీలక పాత్ర పోషించాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్‌లో కేకేఆర్‌ విజయం సాధించి మూడోసారి కప్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌ అనంతరం గౌతమ్‌ గంభీర్‌తో బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే టీమ్‌ ఇండియా ప్రధాన కోచ్‌ పదవి ఖాళీ అవుతున్న క్రమంలో వీరిద్దరిని ఇలా చూడటం ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీసింది. ఇవాళే కోచ్‌ పదవి కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి రోజు కావడం గమనార్హం. ఇప్పటికే గంభీర్‌ను ఒప్పించడానికి బీసీసీఐ ప్రయత్నాలు చేసిందనే ప్రచారం సాగుతోంది.  ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘‘జైషా సార్ మీరు ఒకే ఒక పనిచేయండి. గౌతమ్‌ గంభీర్‌ను భారత జట్టు ప్రధాన కోచ్‌గా నియమించండి’’ అంటూ ఒక నెటిజన్ రిక్వెస్ట్ చేయగా.. ‘‘గంభీర్‌తో జైషా సీరియస్‌గా చర్చిస్తున్నారు. విషయం ఒకటే. అది కన్ఫార్మ్‌ అయినట్లు ఉంది’’ అంటూ ఇంకో నెటిజన్ కామెంట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news