IPL 2022 కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ కొత్త కెప్టెన్ ఎవ‌రో తెలుసా..?

మార్చి నెలాఖ‌రు నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజ‌న్‌లో త‌మ జ‌ట్టును న‌డిపించే సార‌థిని కోల్‌క‌తా నైట్ నైడ‌ర్స్ యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది. శ్రేయాస్ అయ్య‌ర్‌ను కొత్త అయ్య‌ర్‌ను కొత్త కెప్టెన్‌గా నియ‌మిస్తున్న‌ట్టు వెల్ల‌డించింది. ఇటీవ‌ల ముగిసిన వేలంలో శ్రేయాస్ అయ్య‌ర్‌ను కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ రూ.12.25 కోట్ల‌కు కొనుగోలు చేసింది. అత‌డు గ‌తంలో ఢిల్లీ జ‌ట్టుకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. అయితే గ‌త సీజ‌న్‌లో గాయం కార‌ణంగా కొన్ని మ్యాచ్‌ల‌కు దూరంగా ఉన్నాడు.

కొల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టుకు ఇప్ప‌టివ‌ర‌కు గంగూలీ, బ్రెండ‌న్ మెక్ క‌ల‌మ్, గౌత‌మ్ గంబీర్‌, దినేష్ కార్తీక్‌, ఇయాన్ మోర్గాన్ వంటి ఆట‌గాళ్ల‌ను కెప్టెన్‌గా వ్య‌వ‌హారించాడు. ఈ జాబితాలో శ్రేయాస్ అయ్య‌ర్ చేర‌బోతున్నాడు. కోల్‌క‌తా జ‌ట్టుకు సార‌థిగా వ్య‌వ‌హ‌రించి రెండు టైటిల్స్ అందించాడు. శ్రేయాస్ అయ్యార్ కూడా అదే సెంటిమెంట్ రిపీట్ చేస్తాడ‌ని ఆ జ‌ట్టు యాజ‌మాన్యం ఆశిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయ్య‌ర్ 2020లో ఢిల్లీకి సార‌థ్యం వ‌హించి పైన‌ల్‌కు తీసుకెళ్లిన సంగ‌తి తెలిసిందే.