గుడి అంటే..మనకు ముందు మనసులో కనిపించే విజువల్..ఆ దేవుడు, గుడిగంటలు, ప్రసాదం..గుడికి వచ్చిన వాళ్లు ప్రసాదం తినక మానరు..గంట కొట్టకుండా ఉండరు. అసలు గంట లేని హిందు ఆలయాన్ని చూశారా..పోనీ మీరు టెంపుల్ కి వెళ్లి గంట కొట్టకుండా ఉంటారా..ఆలయాల దగ్గర్లో పెంట్ హౌస్ లో ఉండేవాళ్లకు ఆ చుట్టుపక్కల ఉండే ఆలయం వల్ల మనసకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ ఇలా ఉండేవాళ్లకు మాత్రమే అర్థమవుతుంది.
పొద్దున్నే లేవగానే ఎక్కుడో దూరంగా దేవుడి నామస్మరణలు, ఆ గంటలు వినిపిస్తుంటే.. డే స్టాట్ విత్ మోటివిషేన్ హే ఇగ.. కానీ కర్ణాటకలో ప్రసిద్ధ ఆలయానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ గుడిలోని గంటల మోత వల్ల శబ్ధకాలుష్యం అవుతుందని నోటీసుల్లో పేర్కొన్నారు. దానిని తగ్గించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారట.
బెంగళూరులోని ప్రసిద్ధ దొడ్డ గణపతి ఆలయంలో గుడి గంటల మోత వల్ల శబ్ద కాలుష్యం పెరుగుతోందని బసవనగుడి పోలీసులు ఆలయ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. ఆలయంలో గుడిగంటల వల్ల ఏర్పడుతున్న శబ్ద కాలుష్యం వల్ల పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దానిని కంట్రోల్ చేయకపోతే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇంకా గుడిలో వాడే మైకులు, టేప్ రికార్డర్లు, గంటలను పరిధి మేరకు ఉపయోగించాలని సూచించారు. లేకపోతే శబ్దకాలుష్యం (క్రమబద్ధీకరణ, నియంత్రణ) చట్టం 2000, పర్యావరణ కాలుష్య చట్టం 1986 కింద కేసు నమోదు చేయవల్సి వస్తుందని, చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. బెంగళూరులో దొడ్డ గణపతి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో గణపతితో పాటు ఆంజనేయ ఆలయం, దొడ్డ బసవన్న ఆలయాలు ఉన్నాయి.
బెంగుళూరు వాసులుకు ఈ ఆలయం అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. మన దగ్గర కూడా కొన్ని ఆలయాల్లో విపరీతమై సౌండ్స్ వస్తుంటాయి. డీజేలకు అనుమతించని ప్రభుత్వం.. ఆలయాల్లో బయటకు వచ్చే మైకుల శబ్దాలకు మాత్రం ఎందుకు అనుమతిస్తుంది.. ఆ దిశగానే చర్యలు తీసుకుందని కొందరు అంటున్నారు. ఇప్పటికే కర్ణాటకలో మతవిద్యేషాలు ఎక్కువైపోయాయి.
హిజాబ్ పేరతో అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి యావత్ దేశం స్పందించింది. కొందరు సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు తీవ్రంగా ఖండిస్తున్నారు..ఇప్పుడు ఆలయాల్లో గుడిగంటలు తగ్గించమంటూ నోటిసులు జారీచేసిన విషయం కూడా అక్కడ లేనిపోని సమస్యను తెచ్చిపెట్టేదిలానే ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు..