రాణించిన ఢిల్లీ బ్యాటర్స్.. ముంబయి టార్గెట్ ఎంతంటే..?

-

ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై కి మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు విజృంభించారు. ప్రధానంగా జాక్ ఫ్రేసర్ 27 బంతుల్లో 84 పరుగులు చేయడం విశేషం. మరో ఓపెనర్ అభిషేక్ పోరెల్ 27 బంతుల్లో 36 పరుగులు చేశాడు. హోప్ 17 బంతుల్లో 41 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

రిషబ్ పంత్ 19 బంతుల్లో 29 పరుగులు చేశాడు.  చివరిలో స్టబ్స్ అద్భతమైన ఇన్నింగ్స్ ఆడాడు.  ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 257/4 పరుగులు చేసింది.  ముంబయి బౌలర్లలో పియూష్ చావ్ల, వుడ్, మహ్మద్ నబి, బుమ్రా తలో వికెట్ తీశారు. ముంబయి టార్గెట్ .. ఈ మ్యాచ్ లో ఎవ్వరూ పై చేయి సాధిస్తారో వేచి చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Latest news