రానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌కు గాను ఫిబ్రవరి 18వ తేదీన ఐపీఎల్ మేనేజ్‌మెంట్ ఆటగాళ్లకు వేలం నిర్వహించనున్న విషయం విదితమే. ఇందులో భాగంగా ఇప్పటికే ఫ్రాంచైజీలు పలువురు ప్లేయర్లను వదులుకున్నాయి. దీంతో మొత్తం 200 మంది వరకు ప్లేయర్లకు వేలం నిర్వహిస్తారు. ఇక కొందరు ప్లేయర్లను టీంలు ట్రేడ్ చేసుకుంటున్నాయి. అందులో భాగంగా రాజస్థాన్ ప్లేయర్ రాబిన్ ఊతప్పను చెన్నై తీసుకుంది. ఊతప్పకు రూ.3 కోట్ల విలువ ఉంది. దీంతో అంతే మొత్తాన్ని చెన్నై టీం రాజస్థాన్ కు ఇచ్చింది. అయితే ఊతప్పను తీసుకోవడం పట్ల చెన్నై టీంను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ టీం ట్రేడిన్ లో భాగంగా రాజస్థాన్ ప్లేయర్ రాబిన్ ఊతప్పను తీసుకోవడంపై కొందరు ప్రశంసిస్తున్నారు. రాబిన్ లాంటి సీనియర్ ప్లేయర్ జట్టులో ఉండడం చెన్నైకి బలం అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ చాలా మంది మాత్రం ఊతప్పను చెన్నై తీసుకున్నందుకు ఆ టీంను విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. చెన్నైలో యువకులు లేరని, 30 ప్లస్ ప్లేయర్లు ఉన్నారని, అందుకనే అతన్ని తీసుకున్నారని.. రక రకాల కామెంట్లు పెడుతున్నారు.
Do we have a policy like corporates who say we pick candidates only with 10+ years of experience o.O ? https://t.co/YCEs1uPQm2
— Priyones Dass (@priyones_dass) January 21, 2021
CSK looking to maintain their average age https://t.co/9IdQgBq0ZI
— Rishit_Sachinist •EF• (@RishitShukla) January 21, 2021
Maintaining the average age at 30+ is a must 🤞😂 https://t.co/D63qn2cdVy
— Gokul Gc (@gokul662) January 21, 2021
కాగా రాబిన్ ఊతప్ప ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 4607 పరుగులు చేశాడు. 189 మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఐపీఎల్ 2019లో అతను రాజస్థాన్ తరఫున 12 మ్యాచ్‌లు ఆడి 282 పరుగులు మాత్రమే చేయగా, ఇటీవల ముగిసిన సీజన్‌లో 196 పరుగులు చేశాడు. కానీ 2014లో ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సాధించాడు. అయితే వచ్చే సీజన్‌లో రాబిన్ చెన్నై తరఫున ఎలా ఆడుతాడో చూడాలి.