BREAKING : గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం.. చెలరేగిన కోహ్లీ, జాక్స్‌

-

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 201 పరుగుల లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. జాక్స్‌ (100*), కోహ్లీ (70*) చెలరేగారు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. 201 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ఒకే వికెట్ కోల్పోయి 16 ఓవర్లలోనే ఛేదించింది. విల్ జాక్స్‌ (100*; 41 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించగా.. విరాట్ కోహ్లీ (70*; 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెస్మరైజింగ్గా ఆడాడు. బెంగళూరు తొలి వికెట్‌గా కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ (24) ఔటయ్యాడు. నాలుగో ఓవర్‌ ఐదో బంతికి ఫాఫ్‌ను సాయికిషోర్‌ ఔట్‌ చేశాడు.

మరోవైపు బెంగళూరుతో ఆడిన మ్యాచ్‌లో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (84*; 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), షారుక్ ఖాన్ (58; 30 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచికొట్టారు. డేవిడ్ మిల్లర్ (26*; 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. వృద్ధిమాన్ సాహా (5), శుభ్‌మన్ గిల్ (16) నిరాశపర్చారు. బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్ సింగ్, మహ్మద్ సిరాజ్, మ్యాక్స్‌వెల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news