IPL 2022: ముంబయికి షాక్​.. రోహిత్​కు భారీ జరిమానా

-

ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కి ఐపీఎల్ 2022 సీజన్లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇప్పటికే వరుసగా నాలుగు మ్యాచ్ లో ముంబై ఓటమి పాలు కాగా… తాజాగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లోనూ ఓడింది. దీంతో వరుసగా 5 మ్యాచ్‌ లలో ఓడింది ముంబై ఇండియన్స్‌ జట్టు. పంజాబ్ విధించిన 199 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక పోయింది.

ఓపెనర్ రోహిత్ శర్మ (28), ఇషాన్ కిషన్ (3) రాణించలేకపోయారు. దీంతో నిన్నటి మ్యాచ్‌ లో పంజాబ్‌ విజయం సాధించింది. అయితే.. మ్యాచ్‌ పోయిన బాధలో ఉన్న ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. ఈ మ్యాచ్‌ లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా రోహిత్‌ కు 24 లక్షల జరిమానా విధించారు.

ఇది వరకు 12 లక్షల జరిమానాను చవి చూశారు రోహిత్. రెండో సారి కూడా అదే తప్పిదం జరిగితే.. నిబంధనల ప్రకారం.. జరిమానా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు జట్టు ఆటగాళ్లందరూ కూడా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 10 మంది ఆటగాళ్లు ఒక్కొక్కరు ఆరు లక్షల రూపాయలు లేదా మ్యాచ్‌ ఫీజులో 25 శాతం.. ఏది తక్కువ మొత్తం అయితే.. అది ఫైన్‌ రూపంలో కట్టాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news