సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కు ఊహించని షాక్ తగిలింది. రెండు వరుస విజయాలు అందుకున్న హైదరాబాద్ జట్టు… గాడిలో పడుతుందనే లోపే మరో ఎదురు దెబ్బ తగిలింది. నిన్న గుజరాతి టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో srh ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు.
దీంతో రాబోయే మ్యాచులకు వాషింగ్టన్ సుందర్ అందుబాటులో ఉండబోదని హైదరాబాద్ కోచ్ టామ్ మూడి ప్రకటన చేశారు. “సుందర్ కుడిచేతి బొటన వేలికి గాయమైంది. రెండు వారాలపాటు అతనికి విశ్రాంతి అవసరం. కాబట్టి.. వాషింగ్టన్ సుందర్ రాబోయే మ్యాచ్ లకు దూరం కాబోతున్నాడు. అతని స్థానంలో మరో ప్లేయర్ ను తీసుకో పోతున్నాము ” అని పేర్కొన్నారు.
అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్లో రాణిస్తూ నా వాషింగ్టన్ సుందర్ గాయం తో వైదొలగడంతో హైదరాబాదు జట్టు పెద్ద లోటే కానుందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా గుజరాత్ టైటాన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 8 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ను చిత్తు చేసింది.