IPL Retention : రిటైన్ ఆట‌గాళ్లు వీరే.. స్టార్ క్రికెట‌ర్ల కు భారీ మొత్తం

-

ఐపీఎల్ 2022 కోసం రిటెన్ష‌న్ ప్రక్రియా ముగిసింది. ఫ్రాంచైజీ లు స్టార్ ఆట‌గాళ్ల ను త‌మ జ‌ట్టు తో అట్టి పెట్టు కోవ‌డానికి భారీ మొత్తం లో వెచ్చించాయి. అలాగే ప‌లువురు స్టార్ ఆట‌గాళ్ల ను కూడా వ‌దులుకున్నాయి. అయితే వారి ని మెగా వేలం లో కొనుగోలు చేసు అవకాశం ఉంది. అయితే ఈ సారి రిటెన్ష‌న్ ప్ర‌క్రియా లో ప్ర‌తి జ‌ట్టు గ‌రిష్టం గా న‌లుగురు ఆట‌గాళ్ల‌ను అట్టి పెట్టు కోవ‌చ్చు. అందులో ఇద్ద‌రు విదేశి ఆట‌గాళ్ల ను తీసుకోవ‌చ్చు. ముగ్గురు స్వ దేశి ఆట‌గాళ్లు ఉండాలి. అలాగే ఇప్పుడు ఉన్న 8 జ‌ట్లు రిటెన్ష‌న్ ప్ర‌క్రియా ముగిసిన త‌ర్వాత కొత్త గా వ‌స్తున్న ల‌క్నో, ఆహ్మ‌దాబాద్ జ‌ట్లు ముగ్గురు ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసుకుంటాయి. అందులో ఒక విదేశి ప్లేయ‌ర్ ఉంటాడు. అయితే ఈ రిటెన్ష‌న్ లో ఎయే జ‌ట్టు ఎవ‌రి రిటైన్ చేసుకుందో చూద్దం.

ముంబాయి ఇండియన్స్ : ముంబాయి ఇండియ‌న్స్ జ‌ట్టు న‌లుగురు ఆట‌గాళ్ల ను రిటైన్ చేసుకుంది. అత్య‌ధికంగా కెప్టెన్ రోహిత్ కు రూ. 16 కోట్లు వెచ్చించింది. అలాగే ఫాస్ట్ బౌల‌ర్ బుమ్రా కు రూ. 12 కోట్లు, సూర్య కుమార్ యాద‌వ్ కు రూ. 8 కోట్లు, విదేశి ఆట‌గాడు పొలార్డ్ కు రూ. 6 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది.

చెన్నై సూప‌ర్ కింగ్స్ : చెన్నై ఫ్రొచైంజీ కూడా న‌లుగురు ఆట‌గాళ్ల ను రిటైన్ చేసుకుంది. అయితే అత్య‌ధిక ధ‌ర ను ధోని కి కాకుండా అల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా కు వెచ్చించింది. జ‌డేజా కు రూ. 16 కోట్లు, కెప్టెన్ ధోని కి రూ. 12 కోట్లు, మొయిన్ అలీ కి రూ. 8 కోట్లు, యువ సంచ‌ల‌నం రుతు రాజ్ గైక్వాడ్ కు రూ. 6 కోట్ల ను కేటాయించింది.

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ జ‌ట్టు ముగ్గురిని మాత్ర‌మే రిటైన్ చేసుకుంది. కేన్ విలియ‌మ్ స‌న్ కు రూ. 14 కోట్లు, అబ్దుల్ స‌మ‌ద్ కు రూ. 4 కోట్లు, ఉమ్రన్ మాలిక్ కు రూ. 4 కోట్లు వెచ్చించింది.

కోల్‌క‌త్త నైట్ రైడ‌ర్స్ : కోల్‌క‌త్త కూడా న‌లుగురు ఆట‌గాళ్ల‌ను రిటైన్ చేసుకుంది. అండ్రూ ర‌స్సెల్ కు రూ. 12 కోట్లు , యువ‌సంచ‌లనం వెంక‌టేష్ అయ్యార్ కు రూ. 8 కోట్లు, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి కి రూ. 8 కోట్లు, సునీల్ నరైన్ కు రూ. 6 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది.

ఢిల్లీ క్యాపిట‌ల్స్ : ఢిల్లీ కూడా మొత్తం నలుగురు ఆట‌గాళ్ల‌ను అట్టి పెట్టుకుంది. రిష‌బ్ పంత్ కు రూ. 16 కోట్లు, అక్ష‌ర్ ప‌టేల్ కు రూ. 9 కోట్లు, పృథ్వీ షా రూ. 7.5 కోట్లు, ఎన్రిచ్ నార్జ్ కు రూ. 6.5 కోట్లు ను కేటాయించింది.

పంజాబ్ కింగ్స్ : పంజాబ్ జ‌ట్టు కేవలం ఇద్ద‌రి ని మాత్ర‌మే రిటైన్ చేసుకుంది. మ‌యాంక్ అగ‌ర్వాల్ కు రూ. 12 కోట్లు, అర్ష్ దీప్ సింగ్ కు రూ. 4 కోట్లు వెచ్చించింది.

రాజ‌స్ధాన్ రాయ‌ల్స్ : రాజ‌స్థాన్ జ‌ట్టు ముగ్గురిని రిటైన్ చేసుకుంది. సంజు శాంస‌న్ కు రూ. 14 కోట్లు, బ‌ట్ల‌ర్ కు రూ. 10 కోట్లు, జైశ్వ‌ల్ కు రూ. 4 కోట్లు కేటాయించింది.

రాయల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్ : బెంగ‌ళూర్ జ‌ట్టు కేవ‌లం ముగ్గురు ఆట‌గాళ్ల నే రిటైన్ చేసుకుంది. కోహ్లి కి రూ. 15 కోట్లు , మ్యాక్స్ వెల్ కు రూ. 11 కోట్లు, సిరాజ్ కు రూ. 7 కోట్లు కేటాయించింది.

Read more RELATED
Recommended to you

Latest news