ఆ రక్త గ్రూపులకే కొవిడ్ ముప్పు ఎక్కువ.. అవి ఏవంటే?

కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తున్నది. దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వెలుగు చూడటం, ఆ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తిస్తుందనే అంచనాల నేపథ్యంలో ఆందోళన నెలకొంది. గతంలో మాదిరిగా భయానక పరిస్థితులు ఎక్కడ తలెత్తుతాయోనని ప్రపంచం భయం గుప్పిట చిక్కింది. ఈ నేపథ్యంలో ఏయే రక్త గ్రూపుల వారికి కొవిడ్ ముప్పు అత్యధికంగా ఉంటుంది? ఏయే గ్రూపుల వారికి తక్కువగా ఉంటుంది? అనే విషయమై దేశంలోని ప్రముఖ హాస్పిటల్ సర్వే నిర్వహించింది.

దేశంలోని ప్రముఖమైన సర్ గంగారాం హాస్పిటల్ కరోనా పేషెంట్లపై అధ్యయనం చేపట్టింది. అత్యధిక రిస్క్ ఎదుర్కొంటున్న బ్లడ్ గ్రూపులు, అతి తక్కువ రిస్క్ ఉన్న బ్లడ్ గ్రూపులు ఏవో పరిశీలన జరిపింది. A, B, Rh+ రక్త గ్రూపుల వారికి కరోనా సోకే ముప్పు ఎక్కువగా ఉన్నదని ఆ అధ్యయనం తేల్చింది. వీరితో O, AB, Rh- రక్త గ్రూపుల వారికి తక్కువ ముప్పు ఉన్నట్లు వెల్లడైంది. మొత్తం 2586 మంది కరోనా పేషెంట్లపై సర్ గంగారాం హాస్పిటల్ సర్వే చేపట్టింది. B గ్రూపు కలిగిన మహిళల కంటే అదే గ్రూపు రక్తం కలిగిన పురుషులు ఎక్కువ ముప్పు ఎదుర్కొంటున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.