టెస్టు కెప్టెన్సీ అప్ప‌గిస్తే.. పెద్ద బాధ్య‌త‌గా భావిస్తా : కెఎల్ రాహుల్

-

టీమిండియా టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి ఇటీవ‌ల త‌ప్ప‌కున్న విష‌యం తెలిసిందే. అయితే విరాట్ కోహ్లి స్థానాన్ని ఎవ‌రు భ‌ర్తీ చేస్తారో అనే ఇంకా సందీగ్ధంలోనే ఉంది. అయితే టెస్టు కెప్టెన్సీ రేసులో ప్ర‌స్తుతం ప‌ర‌మిత ఓవ‌ర్ల కెప్టెన్ గా ఉన్న రోహిత్ శ‌ర్మ‌తో పాటు వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్, కెఎల్ రాహుల్, బుమ్రా ఉన్నారు. అయితే సౌత్ ఆఫ్రికాతో జ‌ర‌గ‌బోయే వ‌న్డే సిరీస్ కు ముందు టెస్టు కెప్టెన్సీ పై కెఎల్ రాహుల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

త‌న‌కు టెస్టు కెప్టెన్సీ ప‌గ్గాలు అప్ప‌గిస్తే.. పెద్ద బాధ్య‌తగా భావిస్తాన‌ని అన్నారు. పూర్తి కాలం కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం వ‌స్తే.. గ‌ర్వంగా ఫీల్ అవుతాన‌ని తెలిపారు. కాగ ప్ర‌స్తుతం సౌత్ ఆఫ్రికాతో జ‌ర‌గ‌బోతున్న వ‌న్డే సిరీస్ కు కెఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అలాగే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పై కూడా కెఎల్ రాహుల్ ఆస‌క్తిర‌మైన వ్యాఖ్య‌లు చేశాడు. కోహ్లి జ‌ట్టు విజయాల‌నే కాకుండా అద్భుతాల‌ను కూడా సృష్టిస్తాడ‌ని అన్నారు. ప్ర‌తి ఆట‌గాడిలోనూ న‌మ్మ‌కాన్ని క‌లిగిస్తాడ‌ని అన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news