కోహ్లీ నెట్ ప్రాక్టీస్.. మూడో టెస్టుకు సిద్ధం!

-

వెన్ను నొప్పి కారణంగా టీమిండియా టెస్టు కెప్ట‌న్ విరాట్ కోహ్లి సౌత్ ఆఫ్రికాతో జ‌రుగుతున్న రెండో టెస్టుకు అందుబాటులో లేడు. మూడో టెస్టుకు కూడా విరాట కోహ్లి అందుబాటులో ఉంటాడో లేదో అనే సందేహం అభిమానుల్లో ఉండేది. అయితే తాజా గా విరాట్ కోహ్లి నెట్ లో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో క‌లిసి చెమ‌టోడుస్తున్నాడు. బ్యాట్ తో తీవ్రంగా ప్రాక్టిస్ చేస్తున్నాడు. దీంతో విరాట్ కోహ్లి సౌత్ ఆఫ్రికాతో జ‌ర‌గ‌బోయే మూడో టెస్టుకు అందుబాటులో ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. కాగ జ‌న‌వరి 11 నుంచి కేప్ టౌన్ వేదిక‌గా మూడో టెస్టు ప్రారంభం కానుంది.

అయితే విరాట్ కోహ్లి ఇప్ప‌టి వ‌ర‌కు త‌న కేరీర్ లో 98 టెస్టు మ్యాచ్ లు ఆడాడు. మూడో టెస్టుకు విరాట్ కోహ్లి అందుబాటులో ఉంటే.. అత‌నికి 99 వ టెస్టు మ్యాచ్ అవుతుంది. అయితే విరాట్ కోహ్లికి వెన్ను నొప్పి రాకుంటే సౌత్ ఆఫ్రికా సిరీస్ ల‌నే 100 టెస్టు మ్యాచ్ లు ఆడిని ఆట‌గాడిగా రికార్డు సృష్టించేవాడు. అయితే వెన్ను నొప్పి తో రెండు టెస్టు ఆడలేదు. దీంతో విరాట్ కోహ్లి 100వ టెస్టు ఆడాలంటే ఫిబ్ర‌వ‌రి 25 వ‌ర‌కు ఆగాల్సిందే. ఫిబ్ర‌వ‌రి 25 నుంచి శ్రీ‌లంక‌తో రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ఆడ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news