నేడు శ్రీలంక, టీమిండియా మధ్య పింక్ బాల్ తో డే అండ్ నైట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పింక్ బాల్ తో అనుభవం తక్కువగా ఉన్న టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 252 పరుగులకే ఆలౌట్ అయింది. యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యార్ (92) మినహా అందరూ కూడా దారుణంగా విఫలం అయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ (15), సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లి (23) కే అవుట్ అయ్యారు. అలాగే యువ సంచలనం రిషబ్ పంత్ (39) పరుగులతో పర్వలేదని అనిపించాడు.
జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్ ఆల్ రౌండర్లు కూడా ఈ పింక్ బాల్ టెస్టులో విఫలం అయ్యారు. దీంతో టీమిండియా కేవలం 59.1 ఓవర్లో 252 పరుగులు చేసి ఆలౌట్ అయింది. శ్రీలంక బౌలర్లు… లసిత్ ఎంబుల్ దెనియా, ప్రవీన్ జయవిక్రమ తలో మూడు వికెట్లు తీసుకున్నారు. అలాగే ధనుంజయా డీ సెల్వ రెండు వికెట్లను పడగొట్టాడు. వీరితో పాటు సురంగ లక్మల్ కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. కాగ శ్రీలంక కాసేపట్లో మొదటి ఇన్నింగ్స్ ను ప్రారంభం చేయనుంది.