సౌత్ ఆఫ్రికా కీపర్ మరియు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మన్ అయిన క్విన్టన్ డికాక్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికే సమయాన్ని ప్రకటించి జట్టు యాజమాన్యానికి మరియు తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఇక రెండు సంవత్సరాల క్రితమే డికాక్ టెస్ట్ క్రికెట్ నుండి తప్పుకున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అప్పటికి పెద్ద వయసు లేనప్పటికీ కొన్ని కారణాల వలన టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఇప్పుడు వన్ డే క్రికెట్ నుండి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. డికాక్ తెలిపిన ప్రకారం ఈ సంవత్సరం అక్టోబర్ లో ఇండియాలో జరగనున్న వరల్డ్ కప్ ఆడిన తర్వాత తప్పుకుంటున్నాడట. ఇక డికాక్ సౌత్ ఆఫ్రికా తరపున 140 వన్ డే లు మరియు 51 టెస్ట్ లు ఆడగా 9266 పరుగులు చేశాడు. ఇకపై డికాక్ కేవలం టీ 20 లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు.
ఇక ప్రస్తుతం ఐపీఎల్ లో డికాక్ లక్నో సూపర్ జాయింట్స్ తరపున ఆడుతున్నాడు. ఇంకా దేశవ్యాప్తంగా ఎన్నో లీగ్ లలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు.