న్యూజిలాండ్ తో జరుగుతన్న రెండో టీ ట్వంటి మ్యాచ్ లో పాక్ మాజీ ఆటగాడు ఆఫ్రిదీ పేరిటి ఉన్న ప్రపంచ రికార్డు ను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్రెక్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మెట్లు కలిపి అత్యంత వేగంగా 450 సిక్సులు కొట్టిన క్రికెటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ ఘనత సాధించడానికి రోహిత్ శర్మ కేవలం 403 ఇన్నింగ్స్ లు మాత్రమే తీసుకున్నాడు. కాగ ఇప్పటి వరకు ఈ రికార్డు పాకిస్థాన్ మాజీ ఆటగాడు ఆఫ్రిదీ పేరిట ఉండేది.
ఆఫ్రిదీ 450 సిక్స్ లు కొట్టడానికి 487 ఇన్నింగ్స్ లు తీసుకున్నాడు. తర్వాత స్థానంలో వెస్ట్ండిస్ సంచలన బ్యాటర్ క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 450 సిక్స్ లు బాదడానికి 499 ఇన్నింగ్స్ లు అవసరం అయ్యాయి. కాగ న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ ట్వంటి కెప్టెన్ రోహిత్ ఏకంగా 5 సిక్స్ లు బాదాడు. అలాగే అర్థ శతకం తో జట్టు విజయం లో కీలక పాత్ర వహించాడు.