కుల‌దీప్ యాద‌వ్ మెడ ప‌ట్టుకున్న సిరాజ్‌.. వైర‌ల్ వీడియో..

Join Our Community
follow manalokam on social media

చెన్నైలో ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త్ చ‌తికిలప‌డ్డ సంగ‌తి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 578 ప‌రుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అవ‌గా అనంత‌రం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భార‌త్ ఎప్ప‌టిక‌ప్పుడు వికెట్ల‌ను కోల్పోతూ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో 3వ రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ 6 వికెట్ల న‌ష్టానికి 257 ప‌రుగుల స్కోరు వ‌ద్ద కొన‌సాగుతోంది. క్రీజులో ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌లు ఉండ‌గా.. భార‌త్ ఇంకా 321 ప‌రుగులు వెనుకబ‌డి ఉంది. దీంతో ఫాలో ఆన్ గండం పొంచి ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంది.

siraj grabbed neck of kuldeep viral video

అయితే 3వ రోజు మ్యాచ్ లో ఓ కెమెరా డ్రెస్సింగ్ రూమ్ వ‌ద్ద ఉన్న కోచ్ శాస్త్రిని చిత్రీకరించింది. అయితే అదే స‌మ‌యంలో డ్రెస్సింగ్ రూమ్‌లో మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ లోప‌లికి వెళ్తున్న కుల‌దీప్ యాద‌వ్ మెడ‌ను ప‌ట్టుకున్నాడు. చాలా త‌క్కువ నిడివి ఉన్న ఆ క్లిప్ వైర‌ల్ అయింది. దీంతో నెటిజ‌న్లు సిరాజ్ అలా ఎందుకు చేశాడు ? అని సందేహం వ్య‌క్తం చేస్తున్నారు.

సిరాజ్ కావాల‌నే కుల‌దీప్ యాద‌వ్ మెడ‌ను ప‌ట్టుకున్నాడా, లేక ఇద్ద‌రూ జోక్ చేసుకుంటున్నారా.. అనే విష‌యం మాత్రం తెలియ‌లేదు. కానీ ఈ వీడియో వైరల్ అయింది. అయితే ఆ వీడియోను మ‌రీ అంత సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన ప‌నిలేద‌ని, వారు ఇద్ద‌రూ మంచి ఫ్రెండ్స్ అని, జోక్ వేసుకుని ఉండ‌వ‌చ్చు.. అని ప‌లువురు యూజ‌ర్లు కామెంట్లు పెట్టారు. కాగా ఈ టెస్టు మ్యాచ్‌కు నిజానికి ఈ ఇద్ద‌రినీ తుది 11 మందిలోకి తీసుకుంటార‌ని భావించారు. కానీ వీరిని ప‌క్క‌కు పెట్టి ఇషాంత్ శ‌ర్మ‌, షాబాజ్ న‌దీమ్‌ల‌కు చోటు ఇచ్చారు. కానీ వారు చెరో 2 వికెట్లు తీసినా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. ఇక టీం మేనేజ్‌మెంట్ రెండో టెస్టులో అయినా సిరాజ్‌, కుల‌దీప్ యాద‌వ్‌ల‌కు అవ‌కాశం క‌ల్పిస్తుందా, లేదా.. అన్న‌ది చూడాలి.

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...