సౌతాఫ్రికాతో సిరీస్ కు నేడు టీమిండియా జట్టు ఎంపిక

సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ కోసం నేడు టీమిండియా జట్టును ఎంపిక చేయనున్నారు. ఐపీఎల్ లో రాణిస్తున్న పేసర్లు ఉమ్రాన్ మాలిక్, మోసిన్ ఖాన్ తో పాటు వెటరన్ ప్లేయర్లు శిఖర్ ధావన్, దినేష్ కార్తీక్ టీమ్ లో ప్లేస్ కోసం ఎదురుచూస్తుండగా.. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా రేసులోకి వచ్చారు. వెన్ను నొప్పితో ఇబ్బందిపడ్డ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం మెగా లీగ్ లో బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ రాణిస్తున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్, బుమ్రా, పంత్ కు విశ్రాంతి ఇస్తుండడంతో ఎక్కువమంది యంగ్ స్టార్స్ కు ఛాన్స్ ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు.

దీంతో సఫారీ సిరీస్ తో పాటు ఐర్లాండ్ తో రెండు మ్యాచ్ లకు కూడా సేమ్ టీంను కొనసాగించేలా సెలెక్షన్ ఉండనుంది. దీంతో హార్థిక్, ధవన్ లో ఒకరికి కెప్టెన్ గా చాన్స్ దక్కవచ్చని సమాచారం. టీమిండియాలో లెఫ్ట్ ఆర్మ్ పెసర్ కు ఎక్కువ డిమాండ్ ఉండడంతో మోసిన్ ఖాన్ కు కచ్చితంగా ప్లేస్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అక్టోబర్ లో టి20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో మొత్తానికి సెలక్టర్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.