విజ‌య‌కేత‌నం.. 1000వ వ‌న్డే మ్యాచ్‌ను ఘ‌నంగా ముగించిన టీమిండియా

-

ప్ర‌పంచ క్రికెట్ చ‌రిత్ర‌లో 1000వ మ్యాచ్ ను రోహిత్ శ‌ర్మ నేతృత్వంలోని టీమిండియా ఘ‌నంగా ముగించింది. వెస్టిండీస్ తో జ‌రుగుతున్న మూడు వ‌న్డేల సిరీస్ లో భాగంగా మొద‌టి వ‌న్డే మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో 1000 వ‌న్డే మ్యాచ్ ఆడిని టీమిండియా 519 మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించింది. కాగ నేటి మ్యాచ్ లో వెస్టిండీస్ పై భార‌త్ పూర్తి ఆధిప‌త్యాన్ని చెలాయింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండు విభాగాల్లో వెస్టిండీస్ ను చిత్తు చేసింది.

కాగ టాస్ గెలిచి మొద‌ట బౌలింగ్ చేసిన టీమిండియా స్పిన్న‌ర్లను.. వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ల‌ను తిప్పెసింది. ఒక హోల్డ‌ర్ (57) మినహా ఎవ‌రు కూడా భార‌త బౌల‌ర్ల‌ను ఎదుర్కోలేక పోయారు. దీంతో 43.5 ఒవ‌ర్ల‌లోనే 176 ప‌రుగులకు ఆలౌట్ అయింది. స్పిన‌ర్లు చాహ‌ల్ 4, వాసింగ్ట‌న్ సింద‌ర్ 3 వికెట్లు తీసుకున్నారు. అలాగే ప్ర‌సిద్ధ కృష్ణ 2, సిరాజ్ ఒక వికెట్ ను తీసుకున్నారు. కాగ 177 స్వ‌ల్ప ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమిండియా.. ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ (60), ఇషాన్ కిషన్ (28) రాణించారు.

దీంతో మొద‌టి వికెట్ న‌ష్టానికి 84 ప‌రుగులు వ‌చ్చాయి. చివ‌రికి సూర్య కుమార్ (34), దీప‌క్ హుడా (26) పరుగులు చేసి లాంఛ‌నాన్ని పూర్తి చేశారు. దీంతో కేవ‌లం 28 ఒవ‌ర్ల‌లోనే టీమిండియా 1000 వ వ‌న్డే మ్యాచ్ ను గెలుపు తీరాల‌కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news